కడప సెవెన్‌రోడ్స్ : పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్సిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ సంస్థకు కోటి రూపాయల విలువైన 6 సెర్వో–సి వెంటిలేటర్లు, 3 ఎఫ్‌ఎక్స్–8 సర్జికల్ యూనిట్లను అందజేశామని ఎల్‌ఐసీ కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ జీకేఆర్‌వీ రవికుమార్ తెలిపారు. ఎల్‌ఐసీ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్, సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ రత్నాకర్‌లకు ఈ ఎక్విప్ మెంట్‌ను ఎల్‌ఐసీ శ్రీ సత్యసాయి సంస్థల ముఖ్యుల సమక్షంలో అందజేశారని తెలిపారు. శస్త్ర చికిత్సల సమయంలో పూర్తి స్థాయిలో ఉపయోగపడి వారికి కీలక వైద్యాన్ని అందించి రోగుల ప్రాణాల్ని ఈ ఎక్విప్మెంట్ కాపాడతాయని ఆశాభావం వ్యక్తం చేవారు.


