దువ్వూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి వస్తున్నారని, మొక్కజొన్న, అరటి రైతుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ను కోరినట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం దువ్వూరు మండలం చల్లబసాయపల్లె గ్రామంలో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని, విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఎంపీ అవినాష్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కడప జిల్లాలో మొక్కజొన్న పంటను దళారులు క్వింటాలుకు కేవలం రూ.1500తో కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారన్నారు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రూ.2,500 ఉందని, ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు దర రూ.2,500తో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. అరటి పంట గతంలో టన్ను రూ.25 వేలు ఉండేదన్నారు. యుద్ధం కారణంగా ఎగుమతులు జరగకపోవడంతో మరో పక్క ముంబైలో అరటి పంట ఎక్కువ రావడంతో కిలో రూ.5కే దళారులు కొంటున్నారన్నారు. దీంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు అరటి పంటకు రూ.10 వేలు మద్దతు ధర కల్పించి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదుకోవాలని తెలిపారు. మొక్కజొన్న, అరటి రైతుల సమస్యలపై కలెక్టర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. అనంతరం భారత పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యునిగా ఎన్నికై న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డిలు శాలువా కప్పి, పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, జెడ్పీటీసీ మేర్వ కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ గోపిరెడ్డి బాబు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, చల్లబసాయపల్లె సర్పంచ్ సంఘన లక్ష్మిరెడ్డి, మాజీ సర్పంచ్ సంఘన హరినాథరెడ్డి, నాయకులు కోగటం వీరారెడ్డి, బొంతపల్లె వెంకటసుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ గోపాల్‌రెడ్డి, ఇరగంరెడ్డి పద్మనాభరెడ్డి, వ్యవసాయ మండలి జిల్లా మాజీ చైర్మన్ ఓకే రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల మాజీ కన్వీనర్ చిరాకి బాషా, ఎంపీడీఓ సుబ్బారెడ్డి, ఏఓ అమరనాథరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ హరికృష్ణ, డాక్టర్లు సురేష్‌బాబు, రోషిణి, మైదుకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


