కడప ఆర్డీఓ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

కడప ఆర్డీఓ బాధ్యతల స్వీకరణ

Mar 24 2026 7:57 AM | Updated on Mar 24 2026 7:57 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : కడప ఆర్డీఓగా ఎ.మురళి సోమవారం కడప రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల జరిగిన డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లో భాగంగా కడపలో పనిచేస్తున్న జాన్‌ ఎర్విన్‌ బదిలీ అయ్యారు. దీంతో నెల్లూరు జిల్లాలో పీఏ టూ స్పెషల్‌ కలెక్టర్‌ గా పనిచేస్తున్న మురళిని రాష్ట్ర ప్రభుత్వం కడప ఆర్డీఓగా నియమించడంతో ఆ మేరకు బాధ్యతలను స్వీకరించారు.

తహసీల్దార్ల బాధ్యతల స్వీకరణ

కడప జిల్లాలో పలువురు తహసీల్దార్‌లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కడపకు మహబూబ్‌చాంద్‌, రాజంపేటకు యు.దస్తగిరయ్య, నందలూరుకు శివలక్ష్మీ నూతనంగా నియమితులయ్యారు. ఈమె వేంపల్లిలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తూ పదోన్నతి పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement