అంగరంగ వైభవంగా దాశరథి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా దాశరథి కల్యాణం

Mar 24 2026 7:57 AM | Updated on Mar 24 2026 7:57 AM

రాజంపేట : ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యా ణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వంసిద్ధం చేస్తున్నామని, మార్చి 30నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. సోమవారం ఆయన టీటీడీ వివిధ విభాగాల అధికారులతో కలిసి ఒంటిమిట్ట కోదండరామాలయం పరిసర ప్రాంతాలు, కల్యాణవేదిక వద్ద విస్తృతంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మాడవీధులు, క్యూలైన్లు, యాగశాల, పోటు, సాంస్కృతిక వేదికలను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణంలో జర్మన్‌షెడ్లు ఏర్పాటుచేస్తామన్నారు. తాగునీటి సదుపాయాలను కల్పిస్తామన్నారు. లేజర్‌ లైటింగ్‌, ఎల్‌ఈడీ తోరణాలు ఏర్పాటు చేసి, ఉత్సవాలకు అధ్యాత్మిక శోభ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు.

తెలుగుదనం ఉట్టిపడేలా..

రాములోరి కళ్యాణవేదిక తెలుగుదనం ఉట్టిపడేలా పుష్పాలంకరణతో సుందరోపేతంగా తీర్చిదిద్దాలని జేఈవో ఆదేశించారు. భక్తులకు సేవలందించేందుకు తగిన రీతిలో శ్రీవారిసేవకులను ఏర్పాటుచేస్తామన్నారు. ఈ మేరకు సీపీఆర్‌వో డాశ్రీశ్రీటి.రవికి సూచించామన్నారు. శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు, పానకం పంపిణీ చేయాలని అన్నప్రసాదం ప్రత్యేక ఽఅధికారి శాస్త్రిని ఆదేశించామన్నారు. అనంతరం టీటీడీ అధికారులతో విశాంత్రి భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్‌ఈ మనోహరం, ఎస్‌ఈ(విద్యుత్‌) వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో ప్రశాంతి, సీఎంవో డాశ్రీశ్రీకుసుకుమారి, వీజీవో గిరిధర్‌, అదనపు ఆరోగ్యశాఖాధికారి డా.సునిల్‌ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement