అర్జీలు గడువులోగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు గడువులోగా పరిష్కరించాలి

Mar 24 2026 7:57 AM | Updated on Mar 24 2026 7:57 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను గడువులోపు పరిష్కరించాలని జాుుంట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌ సమావేశపు మందిరంలో.ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీదారులకు నాణ్యమైన, సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపే విషయంలో అధికారులు శ్రద్ధ పెట్టి పని చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఎండార్స్‌మెంట్‌ ఇచ్చిన అర్జీలకు జిల్లా అధికారులు కచ్చితంగా పరిశీలించాలన్నారు. జిల్లా అధికారులు వారికి అందిన అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించి సమీక్ష చేయాలన్నారు. అనంతరం పలువురు నుంచి వారు అర్జీలను స్వీకరించారు. జడ్పీ సీఈఓ ఓబులమ్మ, కో– ఆపరేటివ్‌ శాఖ అధికారి వెంకటసుబ్బయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి

కడప అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులతో ఆయన నేరుగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌ శాఖ పరిధిలోకి వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రజలు నిస్సంకోచంగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ రోజు అందిన మొత్తం 92 ఫిర్యాదులను పరిశీలించిన ఆయన, సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్లో మాట్లాడి చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే స్వయంగా ఎస్పీ వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం విశేషం. చట్ట పరిధిలో తగిన న్యాయం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) కె. ప్రకాష్‌ బాబు, మహిళా పి.ఎస్‌ డీఎస్పీ బాలస్వామి రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement