జగన్‌పై కుట్రతో అసత్య ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

జగన్‌పై కుట్రతో అసత్య ఆరోపణలు

Mar 21 2026 5:12 AM | Updated on Mar 21 2026 5:12 AM

కమలాపురం : మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మకు తన కుమార్తె షర్మిల చేతబడి చేసి వశ పరచుకుని తప్పుడు వాంగ్మూలాలు, అబద్ధపు మాటలు చెప్పిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టను దిగజార్చుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు కాశీభట్ల సత్య సాయినాథశర్మ అన్నారు. శుక్రవారం స్థానిక తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ జగన్‌పై రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేని కూటమిలోని కొందరు నాయకులు షర్మిలను రెచ్చగొట్టి విజయమ్మ చేత జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయించడానికి ప్రణాళికలు రచించారన్నారు. ఇదే అదునుగా తీసుకున్న షర్మిల తన తల్లి విజయమ్మను తన వైపు తిప్పుకోవడానికి చేతబడి చేసి మత్తు మందు చల్లి తన వైపు తిప్పుకొని జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కోర్టులలో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తూ కూటమి నాయకులను సంతోష పరుస్తున్నారని పేర్కొన్నారు. చైన్నెలోని ట్రిబ్యునల్‌ కోర్టులో విజయమ్మ ఇచ్చిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే షర్మిల విజయమ్మను లోబర్చుకుని కూటమి నాయకులతో సంప్రదించి రాయించి కోర్టులో సమర్పించినట్లుగా ఉందన్నారు. విజయమ్మ మీద ప్రయోగించిన చేతబడిని, మత్తు మందును తీసివేస్తే అపుడు ఆమెకు వాస్తవ విషయాలు తెలుస్తాయన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కీర్తి ప్రతిష్టలను మరో వంద కాలాల పాటు శాశ్వతంగా ప్రజల హృదయాలలో ఉండే విధంగా కుమారుడిగా బాధ్యత తీసుకుని జగన్‌మోహన్‌రెడ్డి కష్టపడుతూ ఉంటే.. ఆస్తుల కోసం షర్మిల జగన్‌మోహన్‌రెడ్డి వ్యతిరేకులతో చేతులు కలిపి చేస్తున్న కుట్రను దేవుడు కూడా క్షమించడన్నారు.

ఎస్‌ఈసీ సభ్యుడు

సత్య సాయినాథశర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement