ఆదర్శం.. ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఆదర్శం.. ఆహ్వానం

Mar 3 2026 8:10 AM | Updated on Mar 3 2026 8:10 AM

అర్హతలు..

కడప ఎడ్యుకేషన్‌: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు సైతం కార్పొరేట్‌ స్థాయి విద్యనందించాలనే ఉద్దేశంతో ఏపీ మోడల్‌ స్కూల్స్‌ పేరుతో పాఠశాలలను ప్రారంభించారు. సంబంధిత మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి పిబ్రవరి 23వ తేదీ నుంచి నెట్‌బ్యాంకింగ్‌/ క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో ఎగ్జామినేషన్‌ఫీజు పేమెంట్స్‌కు అవకాశం కల్పించారు. అలాగే దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. ఆన్‌లైన్‌న్‌ పేమెంట్స్‌కు మార్చి 31వ తేదీతో గడువు ముగియనుంది.

ఏప్రిల్‌ 12న ప్రవేశ పరీక్ష....

6వ తరగతిలో ప్రవేశానికి గతేడాది మాదిరిగానే పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్‌ స్కూల్‌లోనే ఏప్రిల్‌ 12వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. మెరిట్‌లిస్టు ఆధారంగా రోస్టర్‌ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్‌ 27న మెరిట్‌లిస్టు, ఏప్రిల్‌ 30న సర్టిఫికెట్ల పరిశీలనతోపాటు కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు కూడా ఉన్నత చదువులను అందుబాటులోకి తీసుకుని రావడమే ధ్యేయంగా ఏపీ మోడల్‌ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. వెనుకబడిన మండలాలను గుర్తించి ఆయా మండలాల్లో వీటిని ప్రారంభించారు. ఈ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్‌ వరకు ఇంగ్లిష్‌ మీడియం విద్యను అందించడంతోపాటు విద్యా కానుక కిట్లు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నారు.

పాత ఉమ్మడి కడపజిల్లాలో

పది మోడల్‌ స్కూళ్లు

పాత ఉమ్మడి కడపజిల్లాలో వల్లూరు, ఖాజీపేట, కాశినాయన, పుల్లంపేట, పెనగలూరు, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, చిన్నమండెం, సుండుపల్లి మండలాల్లో మొత్తం పది మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 100 సీట్లు చొప్పున మొత్తం 1000 మందిని ఎంపిక చేస్తారు.

రిజర్వేషన్లు ఇలా...

15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 29 శాతం బీసీలకు ( 7 శాతం బీసీ–ఎ, 10 శాతం బీసీ–బి, ఒక శాతం బీసీ– సి, 7 శాతం బీసీ–డి, 4 శాతం బీసీ–ఈ) సీట్ల కేటాయింపులు ఉంటాయి. దివ్యాంగులకు 3 శాతం, బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయించారు. నిర్థేశించిన విభాగాల్లో అభ్యర్థులు లేకపోతే ఇతర గ్రూపు నుంచి భర్తీ చేస్తారు. మిగతా 50 శాతం సీట్లు ఇతర కులాలకు నిర్థేశించారు.

నోటిఫికేషన్‌ జారీ : 16.02.26

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఆమోదం: 24.02.26

ఫీజు చెల్లింపు చివరితేదీ: 31.03.26

ప్రవేశ పరీక్ష తేదీ: 12.04.26

మెరిట్‌ జాబితా ప్రచురణ: 27.04.26

సర్టిఫిఫెట్‌ పరిశీలన,

కౌన్సెలింగ్‌: 30.04.26

సద్వినియోగం చేసుకోవాలి.....

జిల్లాలోని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలి. మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్‌ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందించాలనే ధ్యేయంతో ఏపీ మోడల్‌ స్కూళ్లను తీసుకొచ్చారు. ఇంగ్లీషు మీడియంలో బోధన జరుగుతుంది. 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. – షేక్‌ షంషుద్దీన్‌, డీఈవో, వైఎస్సార్‌జిల్లా

6వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2014 సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 2016 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 35 మార్కులు పొంది ఉండాలి. వీరికి పరీక్ష ఫీజు రూ.200లు ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 2012 సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 2016 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 30 మార్కులు పొంది ఉండాలి. వీరికి పరీక్ష ఫీజు రూ.125 ఉంటుంది.

సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో 5 తరగతుల్లో చదివి ప్రమోషన్‌న్‌కు అర్హత పొంది ఉండాలి.

పరీక్షలో వచ్చే మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజిర్వేషన్‌ప్రతిపాదికన సీట్లు కేటాయిస్తారు.

ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. 5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్షను తెలుగు/ఇంగ్లిష్‌ మీడియంలో రాయవచ్చు.

cse.ap.gov.in లేదా apms.ap.gov.in వెబ్‌పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిఅడ్మిషన్‌లకు అవకాశం

నోటిఫికేషన్‌ జారీచేసిన విద్యాశాఖ

మార్చి 31వ తేదీ వరకుఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement