మహిళ నేత్రదానం | - | Sakshi
Sakshi News home page

మహిళ నేత్రదానం

Feb 3 2026 7:43 AM | Updated on Feb 3 2026 7:43 AM

మహిళ

మహిళ నేత్రదానం

పులివెందుల టౌన్‌ : పులివెందుల పట్టణం మైత్రి లే అవుట్‌లోని చింతకుంట వెంకటలక్షుమ్మ (95) సోమవారం మరణించడంతో ఆమె కుమారులు, కుటుంబ సభ్యులు, ఆలయాల కమిటీ చైర్మన్‌ సుధీకర్‌ రెడ్డి నేత్రదానానికి అంగీకరిసూ నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజు టెక్నీషియన్‌ ప్రశాంత్‌ కుమార్‌ తో కలిసి వెళ్లి మృతదేహం నుండి కార్నియాలను సేకరించారు. కడప ఎల్వీ ప్రసాద్‌ నేత్రాలయానికి పంపించారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యు లు, బంధువులు, సన్నిహితులకు నేత్ర సేకరణ కేంద్రం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

దాతృత్వం చాటుకున్న గ్రామస్తులు

కమలాపురం : మండల పరిధిలోని పెద్దచెప్పలి ఎస్సీ కాలనీకి చెందిన చిన్నగారి శ్రీనివాసులుకు అదే గ్రామానికి చెందిన ఓ. వేణుగోపాల్‌రెడ్డి, ఓ. శ్యాం సుందర్‌రెడ్డి లు తోటి స్నేహితులతో కలిసి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. శ్రీనివాసులు ఐదేళ్ల కుమారుడు తేజ అనారోగ్యంతో చైన్నెలోని రామకోటి చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వారు సోమవారం తేజ ఇంటి వద్దకు చేరుకుని శ్రీనువాసులు దంపతులకు రూ. లక్ష నగదు అందజేసి తమ ధాతృత్వాన్ని చాటుకున్నారు. దీంతో శ్రీనివాసులు కుటుంబ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

చెస్‌లో సత్తా చాటిన

జిల్లా క్రీడాకారులు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : బెంగళూరు లోని మంజునాథ కళ్యాణ మండపంలో ఈ నెల 1న నిర్వహించిన 58వ బీఆర్‌డీసీఏ నేషనల్‌ లెవల్‌ ఓపెన్‌ – ఏజ్‌ కేటగిరీ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్లో వైఎసాసర్‌ కడప జిల్లా చెస్‌ క్రీడాకారులు సత్తా చాటినట్లు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అనీస్‌ దర్బారి పేర్కొన్నారు. అండర్‌–7 బాలికల విభాగంలో దేవునికడపకు చెందిన వినమ్రత్‌ 7 రౌండ్లలో 6 పాయింట్లు సాధించి ప్రథమ స్థానం పొందాడన్నారు.. ఇదే విభాగంలో క్రీడాకారుడు హర్షిత్‌ నంద 3.5 పాయింట్లు సాధించాడన్నారు. అండర్‌–9 బాలుర విభాగంలో కడపకు చెందిన ప్రణవ్‌ స్వరూప్‌ 7 రౌండ్లలో 5.5 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని కై వసం చేసుకున్నాడన్నారు. అదే విభాగంలో జవాద్‌ 4 పాయింట్లు, దేవ్‌ ఆర్యన్‌ 2.5 పాయింట్లు, గణేష్‌ 2.5 పాయింట్లు సాధించారన్నారు. అండర్‌–12 బాలికల విభాగంలో కడపకు చెందిన లక్ష్మి మనుశ్రీ 7 రౌండ్లలో 4.5 పాయింట్లు సాధించి 8వ స్థానం, ప్రొద్దుటూరుకు చెందిన ధనిత 4.5 పాయింట్లతో 9వ స్థానం పొందారన్నారు. ఇదే విభాగంలో అమీనా 4 పాయింట్లు సాధించిందన్నారు. అండర్‌–12 బాలుర విభాగంలో నిఖిలేష్‌ మరియు భవేష్‌ చెరో 4 పాయింట్లు, షాయన్‌ 3 పాయింట్లు, నికిత్‌ 2 పాయింట్లు సాధించారన్నారు.

అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి బాలిక దుర్మరణం

ప్రొద్దుటూరు క్రైం : స్థానిక పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌పై నుంచి కింద పడి చరిత (12) అనే విద్యార్థిని దుర్మరణం చెందింది. వివరాలిలా... పొట్టిపాటి రామచంద్రారెడ్డి గురుసాయి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. అతను ఎరువుల కంపెనీలోని మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. రామచంద్రారెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కర్నాటక రాష్ట్రంలో బీటెక్‌ చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటోంది, రెండో కుమార్తె చరిత అపార్ట్‌మెంట్‌ ఎదురుగా ఉన్న కేశవరెడ్డి స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థిని కొద్ది సేపు అపార్ట్‌మెంట్‌లోని పిల్లలతో ఆడుకుంది. తర్వాత ఐదో అంతస్తుపైకి వెళ్లి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కింద పడిన వెంటనే వాచ్‌మెన్‌ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి బాలికను చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపాడు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లి స్వాతి విలపించసాగింది. స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున వచ్చారు. త్రీ టౌన్‌ సీఐ రామాంజనేయుడు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

మహిళ నేత్రదానం1
1/3

మహిళ నేత్రదానం

మహిళ నేత్రదానం2
2/3

మహిళ నేత్రదానం

మహిళ నేత్రదానం3
3/3

మహిళ నేత్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement