●తల్లి ప్రోత్సాహం... | - | Sakshi
Sakshi News home page

●తల్లి ప్రోత్సాహం...

Feb 3 2026 7:43 AM | Updated on Feb 3 2026 7:43 AM

●తల్లి ప్రోత్సాహం...

●తల్లి ప్రోత్సాహం...

●తల్లి ప్రోత్సాహం...

రాయచోటి అర్బన్‌ : రెండు సార్లు యూపీఎస్సీలో, ఒకసారి గ్రూప్‌–1కు పోటీ పడ్డా కొలువు దక్కలేదు. ఈసారి మరింత ఉత్సాహంతో పరీక్షకు సన్నద్ధమయ్యాడు. దీనికి తల్లి ప్రోత్సాహం తోడైంది. ఇంకేముంది గ్రూప్‌ –1 విజేతగా నిలిచాడు. రాయచోటి పట్టణం కె.రామాపురానికి చెందిన మద్దిరేవుల అంజన్‌ రెడ్డి (లేట్‌), రెడ్డిరాణిల కుమారుడు మద్దిరేవుల మనీష్‌ రెడ్డి జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. మనీష్‌ రెడ్డి 10వ తరగతి వరకు రాయచోటిలోని భారతీయ విద్యాభవన్‌ పాఠశాలలో, గ్రాడ్యుయేషన్‌ తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కళాశాలలో చదువుకున్నాడు. తండ్రి మరణాంతరం తల్లి రెడ్డిరాణి(జూనియర్‌ అసిస్టెంట్‌) ప్రోత్సాహంతోనే ఇంతటి విజయం సాధించినట్లు మనీష్‌ రెడ్డి తెలిపారు. కలెక్టర్‌ అయ్యి ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని సాక్షితో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement