ఎస్పీడీసీఎల్‌లో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

ఎస్పీడీసీఎల్‌లో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

Feb 3 2026 7:43 AM | Updated on Feb 3 2026 7:43 AM

ఎస్పీడీసీఎల్‌లో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

ఎస్పీడీసీఎల్‌లో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

తిరుపతి రూరల్‌ : ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్‌ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమానికి ఆ సంస్థ సీఎండీ శివశంకర్‌ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గృహ, వ్యవసాయ, విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా డయల్‌ యువర్‌ సీఎండీ, డయల్‌ యువర్‌ ఎస్‌ఈ, కరెంటోళ్ల జనబాట లాంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న ఆయన పారిశ్రామిక రంగాన్ని కూడా ప్రోత్సహించడంలో భాగంగా పరిశ్రమలకు విద్యుత్‌ పరంగా తలెత్తే సమస్యల్ని పరిష్కరించేందుకు వీలుగా ‘‘పారిశ్రామిక విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక‘ను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతినెలా మొదటి బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఆయా జిల్లాల్లోని సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ కార్యాలయాల్లో, ప్రతి మూడో బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.

నిర్ధేశించిన ఆ రోజుల్లో పారిశ్రామిక వినియోగ దారులు సంబంధిత జిల్లా సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ను కలిసి తమ విద్యుత్‌ సమస్యలను తెలియజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement