బస్సుడ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
బి.కోడూరు : మండలంలోని అమ్మవారిపేట గ్రామ సమీపాన గల దర్గా వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సుడ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. వివరాలు..అమ్మవారిపేట గ్రామానికి చెందిన నాగినేనిరమణయ్య (50) తన పొలం పని నిమిత్తం పక్క గ్రామమైన అయ్యవారిపల్లెకు కూలీల కోసం ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుడ్రైవర్ అమ్మవారిపేట గ్రామ సమీపాన గల దర్గా వద్ద ఉన్న మలుపులో హారన్ కొట్టకుండా అతి వేగంగా వచ్చి ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న రమణయ్యను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న బి.కోడూరు ఎస్‌ఐ సూర్యనారాయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రమణయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బస్సుడ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి


