శభాష్‌..సురేష్‌ | - | Sakshi
Sakshi News home page

శభాష్‌..సురేష్‌

Feb 3 2026 7:43 AM | Updated on Feb 3 2026 7:43 AM

శభాష్‌..సురేష్‌

శభాష్‌..సురేష్‌

శభాష్‌..సురేష్‌

పెద్దతిప్పసముద్రం : పేద కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు కష్టాలకు ఎదురొడ్డి..కన్నీళ్లను దిగమింగి పట్టుదలతో చదివాడు.. పేదరికాన్నే కాదు మృత్యువును సైతం జయించి విజేతగా నిలిచాడు. ఒకటి ..రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. తాజాగా విడుదలైన గ్రూప్‌ 1 ఫలితాల్లో డిప్యూటి కలెక్టర్‌గా ఎంపికై న సురేష్‌ విజయగాథ ఇదీ. అన్నమయ్య జిల్లా రాపూరివాండ్లపల్లి పంచాయతీలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన యాదసంద్రం సిద్దప్ప, సిద్దమ్మల కుమారుడు సురేష్‌. బీటెక్‌ పూర్తి చేసిన అనంతరం తిరుపతి సమీపంలోని గాజులమండ్యం వద్ద ఉన్న మల్లాడి డ్రగ్స్‌, ఫార్మాసూటికల్స్‌ ఫ్యాక్టరీలో కెమికల్‌ ఇంజనీర్‌గా పని చేసేవాడు. 2017లో ప్రమాదవశాత్తు ఫ్యాక్టరీలో జరిగిన మిషన్‌ బ్లాస్ట్‌లో సురేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మృత్యువుతో పోరాడి నిలిచి గెలిచాడు. 2019 వైఎస్సార్‌సీపీ హయాంలో పంచాయతీ కార్యదర్శిగా కొలువుదీరిన సురేష్‌ .. గ్రూప్‌ 2 ఫలితాల్లో డిప్యూటి తహశీల్దార్‌గా ఎంపికయ్యారు. తాజాగా విడుదలైన గ్రూప్‌ 1 ఫలితాల్లో డిప్యూటి కలెక్టర్‌ పోస్టుకు ఎంపికయ్యారు. ఐఏఎస్‌ కావడమే తన లక్ష్యమని సురేష్‌ స్పష్టం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement