ఘనంగా డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతి
డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వైఎస్ భారతి, ఈసీ సుగుణమ్మ
పులివెందుల రూరల్: దివంగత నేత, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతిని శుక్రవారం పులివెందులలో ఘనంగా నిర్వహించారు. స్థానిక లయోలా డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్ సమాధుల తోటలోని డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సమాధి వద్ద ఆయన కుమార్తె, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి, ఈసీ గంగిరెడ్డి సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు డాక్టర్ ఈసీ దినేష్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని మెయిన్ రోడ్, గంగిరెడ్డి పాత హాస్పిటల్, రిలయన్స్ స్మార్ట్ షాపింగ్ మాల్‌పైన ఉన్న ఈసీ గంగిరెడ్డి ఫంక్షన్ హాలులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రార్థనల్లో వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ జోసెఫ్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డితోపాటు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మాధవి, వైఎస్సార్‌సీపీ వేముల మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, సత్యప్రభావతమ్మ, నారాయణరెడ్డి, వైఎస్సార్ ఫౌండేషన్ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన మాజీ సీఎం
వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి
ఘనంగా డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతి


