నియామకాలు
కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో పలు నియామకాలు చేపట్టారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర కమిటీలో...
వైఎస్సార్‌సీపీ స్టేట్ ఆర్‌టీఐ విభాగం జనరల్ సెక్రటరీగా సీవీ సుబ్బారెడ్డి (మైదుకూరు), స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీగా వీజే నరసింహాశర్మ (మైదుకూరు) నియమితులయ్యారు.
జిల్లా విభాగంలో...
జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా పి.లక్ష్మినారాయణరెడ్డి (కమలాపురం), జిల్లా యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా కె.వెంకటేశ్వరరెడ్డి( కమలాపురం), జిల్లా వలంటీర్స్ విభాగం జనరల్ సెక్రటరీగా ఎన్.వెంకట ప్రశాంత్‌రెడ్డి (మైదుకూరు) నియమితులయ్యారు.
● మైదుకూరు నియోజకవర్గం విద్యార్థి విభా గం అద్యక్షుడిగా బి.బాలకృష్ణారెడ్డి, నూర్‌బాష దూదేకుల విభాగం అధ్యక్షులుగా డి.శివ నాగేంద్రలు నియమితులయ్యారు.
మదనపల్లె: ఫిబ్రవరి 1న మదనపల్లెలో రాష్ట్ర స్థాయి చెస్ పోటిలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మోహన్ పేర్కొన్నారు. శుక్ర వారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక జ్ఞానోదయ హై స్కూల్‌లో తమ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. విజేతలకు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ బహూకరిస్తున్నట్టు చెప్పారు. వివరాలకు 9008190178కు సంప్రదించాలని కోరారు.
కడప సెవెన్‌రోడ్స్: ఆకాంక్ష జిల్లా, బ్లాకుల్లో నిర్దేశించిన ఇండికేటర్లను అన్ని ప్రామాణికాల్లో మెరుగైన ప్రగతిని సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ‘సంపూర్ణతా అభియాన్ 2.0‘సమగ్ర లక్ష్య సాధనపై దేశంలోని అన్ని ఆకాంక్ష జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీసీకి కడప జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు. వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ నీతీ అయోగ్ సీఈవో ఆదేశాల మేరకు సంపూర్ణతా అభియాన్ 2.0 ఫోకస్ ఇండికేటరైన ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, సంబంధిత రంగాల సేవల్లో మెరుగుదల కోసం సంబంధించిన ఇండికేటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల స్థాయిలో ఆయా ఇండిక్టేటర్లలో సేవల మెరుగుపై విస్తత అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులలో అన్ని శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీవో హజరతయ్య తదితరులు పాల్గొన్నారు.


