ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న సీఎస్
జమ్మలమడుగు : మండల పరిధిలోని ఎస్.ఉప్పలపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ పాల్గొన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరకూరి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామంలో 75 లక్షల రూపాయలతో కమ్యూనిటీ భవనం, డైనింగ్ హాల్, 2.45 కోట్లతో సీసీ రోడ్డు, టీఎం రోడ్డు నిర్మాణం, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 2.78 కోట్లతో 11 సీసీ రోడ్లు, టీబీ రోడ్ల నిర్మాణం, రోడ్డు భవనాల శాఖకు సంబంధించిన 4.90 కోట్ల నిధులతో గూడెంచెరువు– దప్పెర్ల రోడ్డు, ఎస్.ఉప్పలపాడు– మాదవరం బెస్తవేముల రోడ్లును అభివృద్ధి చేయడం కోసం పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రొహిబిషన్ ఎకై ్సజ్‌శాఖ డైరెక్టర్ హరికిరణ్, ఉప్పలపాడు శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరు : మండలంలోని కనుమలో గంగమ్మ గుడి బైపా మలుపు వద్ద రోడ్డు ప్రమాదం మంగళవారం జరిగింది. రాయల్‌పేట గ్రామానికి చెందిన రెడ్డప్పకుమారుడు భాస్కర్(32) తన స్వగ్రామం నుంచి బైక్‌పై పుంగనూరుకు వస్తుండగా బొలెరే వాహనం ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


