ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్: అర్జీదారులు, ఫిర్యాదుదారుల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం సభా భవన్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ముగిసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అధికారి బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. ఫిర్యాదుల పట్ల పరిష్కార నివేదిక అందివ్వడంలో గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు .
కడప వీఆర్‌కు
ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐ?
కడప అర్బన్:ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐగా విధులను నిర్వహిస్తున్న తిమ్మారెడ్డిని కర్నూలు డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు కడప వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులను సోమవారం సాయంత్రం జారీ చేసినట్లు సమాచారం. ప్రొద్దుటూరులోని ఓ బంగారు వ్యాపారి కిడ్నాప్ వ్యవహారంలో తిమ్మారెడ్డితో పాటు, మరో సీఐ, ఇంకా ఒకరిద్దరు ఎస్‌ఐలు, కొంతమంది సిబ్బంది పాత్ర ఉందని పోలీసు అధికార వ ర్గాల విచారణ, బాధితుల ఆవేదన ద్వారా తెలిసింది. దీనిపై ఎస్పీని వివరణ కోరగా న్యాయపరంగా విచారించి తగిన చర్యలను తీసుకుంటామని తెలిపారు.


