ఉయ్యాలవాడ స్ఫూర్తిని కొనసాగించాలి
పులివెందుల : దేశం కోసం పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగ నిరతిని, స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 219వ జయంతి సందర్భంగా పులివెందుల పట్టణంలోని పాత బస్టాండు సమీపంలో నరసింహారెడ్డి విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, చవ్వా దుష్యంత్‌రెడ్డి, ఆర్‌సీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రారెడ్డి, ఆర్‌సీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వోత్తమరెడ్డి తదితరులతో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బ్రిటీష్‌వాళ్లను ఎదిరించిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. రైతుల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. ఆయన జీవించింది కేవలం 40 ఏళ్లు అయినా కూడా 200 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరును మనం స్మరించుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్పగా జీవించారో అర్థం చేసుకోవాలన్నారు. ఆయన స్ఫూర్తిని నేటి తరాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, చవ్వా దుష్యంత్‌రెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని తర్వాత కాలంలో అనేకమంది గొప్ప స్వాతంత్య్ర సమరయోధులు ఆయన బాటలోనే స్వాతంత్య్ర ఉద్యమం కొనసాగించారన్నారు. భారతదేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వజ్ర భాస్కర్‌రెడ్డి, సాంబశివారెడ్డి, లింగాల రామలింగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, హాలు గంగాధరరెడ్డి, ఆర్‌సీడీఎస్ నేషనల్ కన్వీనర్ వల్లపురెడ్డి వెంగళరెడ్డి, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గట్టిరెడ్డి బయపు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రఘురాం రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కర్రి శ్రీనివాసులు రెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నాగేశ్వర్ రెడ్డి, ఎద్దుల అర్జున్ రెడ్డిలతో పాటు ఆర్‌సీడీఎస్ సంస్థ ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
ఘనంగా ఉయ్యాలవాడ జయంతి వేడుకలు
పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు


