ఉత్సాహంగా ‘మ్యాథ్ బీ’
లెక్కలంటే.. చిక్కులని విద్యార్థులు గుబులు పడతారు. లెక్కల క్లాస్ అంటేనే భయపడతారు. ఆ భయం వద్దని.. లెక్కలకూ చిట్కాలు ఉంటాయని ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యాథ్ ‘బి’ కాంపిటీషన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపింది. ఆదివారం కడప నగరంలో నిర్వహించిన రెండోరౌండ్ మ్యాథ్ ‘బి’ కాంపిటీషన్‌కు విద్యార్థుల నుంచి చక్కటిస్పందన లభించింది.
కడప ఎడ్యుకేషన్: లెక్కలంటే అన్నీ చిక్కులే.. కొందిరికిదో బ్రహ్మపదార్థం. అర్థం చేసుకున్న వారికి మాత్రం ఆసక్తికరం. చిన్నవయసులో నేర్చుకునే చిట్కాలు జీవితాంతం గుర్తుండిపోతాయనేది నిపుణుల మాట. విద్యార్థుల్లో గణితంపై భయాన్ని పోగొట్టి.. వారిలో గణితంపై ఆసక్తి పెంచేలా.. చిన్న చిన్న సమస్యలు మొదలు.. వారి స్థాయిని అనుసరించి నిర్వహించిన సాక్షి మ్యాథ్ ‘బి’ కాంపిటీషన్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. కడప నగరంలోని జీఎంఆర్ స్కూల్‌లో నిర్వహించిన మ్యాథ్ ‘బి’ రెండోరౌండ్ కాంపిటీషన్ ఆదివారం నాలుగు కేటగిరీలుగా నిర్వహించారు. కేటగిరీ– 1లో 1, 2 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–2లో 3,4 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–3లో 5, 6,7 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–4లో 8, 9,10 తరగతుల విద్యార్థులు ఈ కాంపిటీషన్‌లో పాల్గొన్నారు. కడపకు చెందిన నాగార్జున మోడల్‌స్కూల్, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్, జీఎంఆర్ హైస్కూల్, చైతన్య స్కూల్, వేంపల్లి, నేతాజీ స్కూల్, గురజాల, సింహాద్రిపురం విద్యార్థులు హాజరై కాంపిటీషన్‌లో తమ ప్రతిభను పరీక్షించుకున్నారు.ఈ కాంపిటీషన్‌ను ‘సాక్షి’ బ్రాంచి మేనేజర్ హరినాథరెడ్డి పర్యవేక్షించారు.
పోటీతత్వం పెరుగుతుంది..
స్పెల్ ‘బి’, మ్యాథ్ ‘బి’ వంటి కాంపిటీటివ్ పరీక్షలకు హాజరుకావడం ద్వారా పోటీ తెలుస్తుంది. మనం ఏస్థాయిలో ఉన్నామో అర్థమవుతుంది. మన ప్రతిభను అంచనా వేసుకునేందుకు ఇటువంటి కాంపిటీషన్స్ ఉపయోగపడతాయని భావిస్తున్నా.
– చర్విత, శివశివాణి స్కూల్, కడప
భయం పోయింది..
కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు వందల్లో పదాలను నేర్చుకోగలిగా. దీంతో నాకు ఇంగ్లీషుపై భయం పోయి మక్కువ పెరిగింది. ఈ పోటీలో పాల్గొనడం ద్వారా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ స్పెల్లింగ్స్ నేర్చుకోవడం నాకు అకడమిక్‌గా కూడా ఉపయోగకరం.
– జువైన్, జీఆర్‌టిజీవీకే స్కూల్, కడప
మ్యాథ్స్ అంటే ఎంతో ఇష్టం..
నాకు గణితమంటే ఎంతో ఇష్టం. సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యాథ్ ‘బి’ కాంపిటీషన్‌లో పా ల్గొనేందుకు వచ్చాను. ఈ కాంపిటీషన్ ఎంతో బాగుంది.– నిరంజన్‌రెడ్డి, హైదరాబాదు పబ్లిక్ స్కూల్, కడప
గణిత భావనలపై పట్టు సాధించేందుకు..
గణితంలో రాణిస్తే అన్నింటా రాణించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మ్యాథ్‘బీ’లో సత్తా తెలుసుకునేందుకు వచ్చాను. కాంపిటీషన్ చాలా బాగుంది. –భవశ్రీ,
నేతాజీ స్కూల్, సింహాద్రిపురం
మ్యాథ్స్ మేడ్ ఈజీ..
గణితం అంటే ఎంతో ఇష్టం. గణితాన్ని సులువుగా నేర్చుకునేందుకు ఎప్పుడూ సిద్ధమవుతుంటా. గణితంపై ఉన్న ఆసక్తే నన్ను కాంపిటీషన్‌లో పాల్గొనేలా చేసింది.
– సాయి ప్రవీణ, జీఎంఆర్ స్కూల్, కడప
ఉత్సాహంగా ‘మ్యాథ్ బీ’
ఉత్సాహంగా ‘మ్యాథ్ బీ’
ఉత్సాహంగా ‘మ్యాథ్ బీ’
ఉత్సాహంగా ‘మ్యాథ్ బీ’
ఉత్సాహంగా ‘మ్యాథ్ బీ’
ఉత్సాహంగా ‘మ్యాథ్ బీ’


