● అన్ని గ్రామాల్లో కమిటీలు | - | Sakshi
Sakshi News home page

● అన్ని గ్రామాల్లో కమిటీలు

Nov 24 2025 7:36 AM | Updated on Nov 24 2025 7:36 AM

● అన్

● అన్ని గ్రామాల్లో కమిటీలు

● అన్ని గ్రామాల్లో కమిటీలు

ప్రొద్దుటూరు : కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలను గుర్తించేందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రామ, వార్డు కమిటీల నియామకాన్ని చేపట్టిందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. జిల్లాకు సంబంధించి తొలిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ గ్రామ, వార్డు కమిటీల ప్రతినిధుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జగనన్నకు ప్రజల్లో ఉన్న ఆదరణ, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతోపాటు మీ అందరి రెక్కల కష్టంతోనే పార్టీ నిలబడిందని అన్నారు. పార్టీని మరింత పటిష్టంగా, సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇంత కాలం పార్టీ కోసం పని చేసిన, పని చేస్తున్న కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వాలనే కారణంతో కమిటీల ఏర్పాటు జరుగుతోందని అన్నారు. కమిటీల ఏర్పాటు తర్వాత క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఐడీ కార్డులను మంజూరు చేస్తారని, భవిష్యత్తులో కమిటీ సభ్యులకు అన్ని విధాలా ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తున్న వారినే కమిటీలో సభ్యులుగా నియమించాలని కోరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 120 యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి వార్డుకు సంబంధించి దాదాపు వంద మందితో కమిటీ సభ్యులను నియమిస్తారన్నారు. ఇందులో ఏడు విభాగాలు ఉన్నాయని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల గుండె చప్పుడు నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిందని తెలిపారు. ఇది ఉద్యమ పార్టీ అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేసి పార్టీని గెలిపించాలని కోరారు. మూడు మార్లు ముఖ్యమంత్రి అయిన బాబు దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాష్ట్రానికి ఏమి చేయలేదని చిరత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు.

హామీలు అమలు చేయని బాబు

ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హామీలను అమలు చేయలేదని విమర్శించారు. అన్ని పథకాలను అమలు చేసిన జగన్‌ ప్రభుత్వంలో రూ.3.30 లక్షల కోట్లు అ ప్పులు ఉంటే, పథకాలను సక్రమంగా అమలు చేయ ని చంద్రబాబు ఇప్పుటికే రూ.2 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు.

వరద అభివృద్ధిపై దృష్టి సారించలేదు

వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం జగన్‌ సహకారంతో ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరును అభివృద్ధి చేశారన్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఎల్లో మీడియా అబద్ధాలే అన్నారు.

ప్రొద్దుటూరులో తొలి సమావేశం

నిర్వహించడం అభినందనీయం

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమ ల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ కామనూరుతో సహా అన్ని గ్రామాలు, వార్డుల్లో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గత ఎన్నికల వరకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్వగ్రామంలో పోలింగ్‌ జరగలేదని, గత ఎన్నికల్లో తన భార్యను ఏజెంట్‌గా కూర్చోబెట్టి ఎన్నికలు జరిపించామన్నారు. దాంతోనే వరద కుటుంబ సభ్యు లు ఎన్నికల ప్రచారం చేసి డబ్బు పంచారన్నారు. అక్కడ కూడా ప్రస్తుతం కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.

సమావేశంలో పార్టీ పరిశీలకులు పి.శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి, స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ మల్లేల రాజారాంరెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ శారద, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బి.లక్ష్మీదేవి, ఎంపీపీ శేఖర్‌యాదవ్‌, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, పట్టణాధ్యక్షుడు బి.వంశీధర్‌రెడ్డి, మండల అధ్యక్షులు చంద్రఓబుళరెడ్డి, వాసంతి తదితరులు పాల్గొన్నారు.

● అన్ని గ్రామాల్లో కమిటీలు1
1/3

● అన్ని గ్రామాల్లో కమిటీలు

● అన్ని గ్రామాల్లో కమిటీలు2
2/3

● అన్ని గ్రామాల్లో కమిటీలు

● అన్ని గ్రామాల్లో కమిటీలు3
3/3

● అన్ని గ్రామాల్లో కమిటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement