స్పెల్‌బీకి చక్కటి స్పందన
కడప ఎడ్యుకేషన్: సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ ‘బి’ కాంపిటీషన్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కడప నగరంలోని నాగార్జున మోడల్ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన స్పెల్ ‘బి’ కాంపిటీషన్ లెవల్–2కు అపూర్వ స్పందన లభించింది. ఈ కాంపిటీషన్‌కు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరై తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ కాంపిటీషన్ మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఆంగ్లంపై ఉన్న భయాన్ని పోగొట్టేలా.. భాషపై పట్టుసాధించేలా కాంపిటీషన్ ఉందంటూ విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఏడాది సాక్షి మీడియా గ్రూప్ స్పెల్ ‘బి’ లెవల్–2 కాంపిటీషన్‌లో కేటగిరీ–1లో 1,2 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4, కేటగిరీ–3లో 5,6,7, కేటగిరీ–4లో 8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్‌కు జిల్లాలోని కడపకు చెందిన నాగార్జున స్కూల్‌తోపాటు మోంట్‌ఫోర్టు, శివశివాణి, హైదరాబాదు పబ్లిక్ స్కూల్, జీఆర్‌టీ, జీవీఆర్ స్కూల్, లిటిల్‌ప్లానెట్ స్కూల్, నేతాజీ స్కూల్, గురజాల, వేంపల్లి శ్రీ చైతన్య స్కూల్, వేంపల్లి నుంచి విద్యార్థులు హాజరయ్యారు.
2025
స్పెల్‌బీకి చక్కటి స్పందన


