నేడు గ్రామ, వార్డు కమిటీల సమావేశం
ప్రొద్దుటూరు: వైఎస్సార్‌సీపీ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి గ్రామ, వార్డు కమిటీల నియామకం పూర్తయింది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఆదివారం దొరసానిపల్లెలోని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఇంటి వద్ద సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి 3వేల మందితో, మధ్యాహ్నం ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి 3వేల మందితో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా కమిటీల నియామకాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పరిశీలకుడు పూల శ్రీనివాసులరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డితోపాటు పలువురు నేతలు హాజరు కానున్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కర్నూలులో ఈ నెల 23న జరిగే ఎస్‌జీఎఫ్ అండర్–19 రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలకు అబ్జర్వర్‌గా పోలంకి గణేష్‌బాబును నియమించారు. ఈయన రామన్నపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఫిజికల్ డైరెక్టర్‌గా ఉన్నారు. డిసెంబర్ 24 నుంచి 29 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–19 రగ్బీ పోటీలో పాల్గొనే ఏపీ జట్టును ఎంపిక చేయనున్నారు.
గణేష్ బాబు
నేడు గ్రామ, వార్డు కమిటీల సమావేశం


