కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా..
మూగజీవాలు, వన్యప్రాణులు, పాడిపశువులు, నిరసనలు, ఆత్మహత్యలు, సంఘవిద్రోహ శక్తులు ట్రాక్‌పైకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలలో భాగ మే ఫెన్సింగ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకోసం తెలుగురాష్ట్రాలలో నిర్మాణానికి రూ.3,200 కోట్లు కేటాయించింది. గుంతకల్– కడప–నందలూరు–రేణిగుంట మార్గాల్లో ఫెన్సింగ్ లేదా గోడల నిర్మాణం జరుగుతోంది. ఆయా రూట్ల ఆధారంగా నిధులు కూడా విడుదల చేసింది. రైలుమార్గాలు అటవీ, పట్టణ ప్రాంతాల గుండా పోతున్నాయి. ఈ క్రమంలో పలు అటవీ జంతువులు పట్టాలు దాటుకునే క్రమంలో రైళ్లకింద పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు ట్రాక్‌మీదపడి మరణిస్తున్నాయి.
● వందేభారత్ లాంటి హైస్పీడ్ రైళ్ల కోసం రెండేళ్ల క్రితం ఎస్సీ రైల్వే తన పరిధిలోని అన్ని ప్రధానమార్గాల్లో 130కి.మీ పైగా వేగాన్ని తట్టుకునేలా సామార్థ్యాన్ని పెంచింది. దీంతో హైస్పీడ్ రైళ్లు తిరుగుతున్న పట్టాలపై ఎలాంటి జంతువులు,మనుషులు రాకుండా స్టీల్ ఫెన్సింగ్ ఏర్పాటుచేయనున్నారు. నేషనల్ హైవేల సమీపంలో ఉన్న ట్రాక్‌లపై క్రియోసెట్ ఆయిల్‌తో ట్రీట్ చేసిన హెచ్‌డీపీ వెదురుబొంగులతో ఫెన్సింగ్ లేదా గోడలు నిర్మించనున్నారు. మరికొన్ని చోట్ల సబ్‌వేలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే రైల్వేగేట్ల స్ధానంలో ఆర్‌యూబీలు, ఆర్వోబీల నిర్మాణాలు జరుగుతున్నాయి.


