● కిలాడీ బాలరంగడు..
కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మదనపల్లె ప్రభుత్వ డయాలసిస్ టెక్నీషియన్ బాలరంగడు, తక్కువ కాలంలోనే ఆర్థికంగా స్థితిమంతుడయ్యాడు. నాలుగేళ్ల క్రితం జిల్లా ఆస్పత్రి డయాలసిస్ కేంద్రానికి కాలినడకన వచ్చి రూ.16వేల జీతానికి పనిచేసిన బాలరంగడు...నేడు ఖరీదైన కారు, బైక్‌లు, విలాసవంతమైన జీవితం, ఆస్తులు సమకూర్చుకోవడం వెనుక కిడ్నీ రాకెట్ కుంభకోణమే ప్రధాన ఆదాయవనరుగా తెలుస్తోంది. అంతేకాకుండా గ్లోబల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ శాశ్వతి, డయాలసిస్ కేంద్రానికి ఇన్‌చార్జ్‌గా ఉండటం బాలరంగడికి కలిసివచ్చింది. డయాలసిస్ కేంద్రంలో బాలరంగడి దందాలపై వైద్యాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.
బాలరంగడు..


