క్రీడలతో మానసికోల్లాసం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఉద్యోగులకు క్రీడలతో మానసిన ఉల్లాసం కలుగుతుందని డీఎస్‌డీవో గౌస్ బాషా పేర్కొన్నారు. గురువారం డీఎస్‌ఏ క్రీడా మైదానంలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలకు 106 మంది హాజరయ్యారన్నారు. ఇందులో వివిధ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి 96 మంది ఉద్యోగులు ఎంపికయ్యారన్నారు. రాష్ట్ర స్దాయి పోటీలు ఈ నెల 19 నుంచి 22 వరకు ఎన్టీఆర్ జిల్లా డీఎస్‌ఏమైదానంలో జరుగుతాయన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20వ తేది వరకు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) ఇ.పవన్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కడపలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం, అన్ని శాఖా గ్రంథాలయాల్లో వారోత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలు కడప కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తామన్నారు. ఈనెల 14న యూకేజీ నుంచి 5వ తరగతి విద్యార్థులకు జాతీయ నాయకుల వేషధారణ పోటీ లు, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అలాగే 8, 9, 10 తరగతుల వారికి పాటల పోటీలు ఉంటాయని తెలిపారు. ఈనెల 15వ తేది 6 నుంచి 10వ తరగతి వరకు వ్యాసరచన పోటీలు, 16న 7 నుంచి 10వ తరగతి వరకు వృక్తృత్వ పోటీలు, 17న 6 నుంచి 10వ తరగతి వరకు చదరంగం పోటీలు, ఈనెల 18న 7 నుంచి 10వ తరగతి వరకు క్విజ్ పోటీలు, 19న 6 నుంచి 10వ తరగతి వరకు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామని వివరించారు. ఈనెల 20వ తేది జరిగే ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు.
కడప అర్బన్: శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం.. ప్రశాంత వాతావరణనాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా పోలీస్ శాఖ అడుగు ముందుకేసింది. అధిక శబ్దం ఉత్పత్తి చేసే సైలెన్సర్లను వాడుతున్న ద్విచక్రాల వాహనాలపై కఠిన చర్యలు చేపట్టింది. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఏ. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కడప ట్రాఫిక్ సీఐ డి.కే జావీద్ తమ సిబ్బందితో కలిసి చేసిన ప్రత్యేకంగా సైలెన్సర్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు సీజ్ చేసిన సుమారు 40 సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించారు. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లు మాత్రమే వాడాలని పోలీసులు సూచించారు. కంపెనీ సైలెన్సర్లను మార్పు చేస్తు న్న మెకానిక్స్ పై కూడా తగిన చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక డైవ్లను కొనసాగిస్తామని డీఎస్పీ వెల్లడించారు.
రాజుపాళెం: గ్రామీణ ప్రాంతాల్లోని పశు వైద్యశాలల్లో పశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా పశు సంవర్థక శాఖ అధికా రి శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని గాదెగూడూరు, కొర్రపాడు గ్రామాల్లోని పశువైద్య కేంద్రాలను, రాజుపాళెంలోని ఏడీ కార్యాలయాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రికార్డులను పరిశీలించారు. పశువులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకొని, పశు వైద్యులకు తగు సూచ నలు ఇచ్చారు. గాలికుంటు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిందని, జిల్లాలో మినీ గోకులం కింద 800 పశువుల షెడ్లు, 1150 జీవాల షెడ్లు నిర్మాణాలు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. పశు సంవర్థక శాఖ ఏడీ సరస్వతి, పశు వైద్యులు ప్రదీప్ కుమార్‌రెడ్డి, లక్ష్మిదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
క్రీడలతో మానసికోల్లాసం


