నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో 31 రోజులు, బ్యూటీ పార్లర్‌లో 35, జ్యూట్‌బ్యాగుల తయారీలో 14 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని ఆ సంస్థ డైరెక్టర్ ఎం.ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. 18–45 ఏళ్ల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ మహిళలు శిక్షణకు అర్హులన్నారు. గ్రామీణ ప్రాంతం వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కలదన్నారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల నిరుద్యోగ మహిళలు ఇందుకు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 94409 05478, 99856 06866, 94409 33028 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వివరించారు.
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బైపీసీ పాస్ అయి డీ– ఫార్మసీ అడ్మిషన్స్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు కడప నగరం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ప్రిన్సి పాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్స్, ఇంటర్ మార్కుల మెమో, ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో, జనన ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్(6వ తరగతి నుంచి ఇంటర్ వరకు), కుల ధ్రువీకరణ పత్రం, టీసీ, ఆధార్‌కార్డు తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు రూ.1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు రూ.600 ఆన్‌లైన్‌లో చెల్లించి రిసిప్ట్ తీసుకుని రావాలని సూచించారు. రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు httpr://poyc-e-t.a p.g-ov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. సందేహాల నివృత్తికి 7981353745, 9440144057 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని వివరించారు.
ప్రొద్దుటూరు కల్చరల్: మండలంలోని కొత్తపేట హైస్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు బి.రోజమ్మ, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.శివశంకర్ తెలిపారు. 10వ తరగతి విద్యార్థి కె.కరీముల్లా కడప డీఎస్‌ఏ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వారు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో జరిగే అండర్–17 బాస్కెట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే 9వ తరగతి చదువుతున్న కె.రాజశ్రీ అండర్–14 విభాగంలో రాయచోటి మాసాపేటలో జరిగిన జిల్లా స్థాయి బేస్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరిని ప్రధానోపాధ్యాయురాలు, వ్యాయామ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: మచిలీపట్నం నుంచి కడప మీదుగా కొల్లంకు ప్రత్యేక రైలు నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. మచిలీపట్నం–కొల్లం (07103) రైలు ప్రతి శుక్రవారం (డిసెంబరు 5, 12, 19, జనవరి 9, 16 తేదీల్లో) నడుస్తుందన్నారు. మచిలీపట్నంలో ఉదయం 11 గంటలకు బయలుదేరి పెడన, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రైల్వేకోడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పాలక్కడ్, తిస్సూర్, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెంగనూరు మీదుగా కొల్లంకు శనివారం రాత్రి 10 గంటలకు చేరుతుందన్నారు. అలాగే కొల్లం–మచిలిపట్నం (07104) రైలు శనివారం (డిసెంబరు 7, 14, 21, జనవరి 11 తేదీల్లో) నడుస్తుందన్నారు. ఈ రైలు శనివారం అర్ధరాత్రి 2.30 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో ప్రయాణించి మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మచిలీపట్నం చేరుతుందన్నారు. ఈ రైళ్లు రాను, పోను పది ట్రిప్పులు నడుస్తాయన్నారు. ముఖ్యంగా అయ్యప్పభక్తులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ


