●నగరంలో ర్యాలీ
కడపకు చేరుకున్న నల్లపురెడ్డి శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. విజయవాడ నుంచి కడపకు చేరుకున్న శ్రీ చరణిని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు భరత్‌రెడ్డి, కార్యదర్శి రెడ్డిప్రసాద్ ఆధ్వర్యంలో సాదర స్వాగతం లభించింది. అనంతరం క్రీడాకారులు, క్రీడాభిమానులు, ప్రజలతో కలిసి నగరంలోని కళాక్షేత్రం నుంచి ఎర్రముక్కపల్లెలోని గాంధీనగర్ హైస్కూలు వరకు ర్యాలీ నిర్వహించారు. ఆమె రాక ఆలస్యమైనా.. ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆమెను చూసేందుకు పలువురు మహిళలు సైతం ఆసక్తిగా ఎదురుచూశారు. అనంతరం నగర శివార్లలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో శ్రీచరణిని ఘనంగా సత్కరించారు.
శ్రీచరణి వాహనంపై పూల వర్షం


