కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం స్వల్పంగా వర్షం కురిసింది. అట్లూరు, రాజుపాలెం, ఒంటిమిట్టలలో 2.8 మిల్లీమీటర్లు, కాశినాయన, సిద్దవటంలో 1.2, పోరుమామిళ్లలో 1 ఎంఎం వర్షపాతం నమోదైంది.
కడప సెవెన్‌రోడ్స్: దీపావళిని ప్రజలు ఈనెల 20వ తేదీన నిర్వహించుకోవాలని శ్రీ లక్ష్మీ సత్యనారాయణస్వామి ఆలయ అర్చకులు, కడప జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షులు కేహెచ్ విజయ్‌భట్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పండుగ నిర్వహణ విషయంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:37 గంటలకు అమావాస్య ప్రారంభమై 21వ తేదీ మంగళవారం సాయంత్రం 4:03 వరకు కొనసాగుతుందన్నారు. ఈ కారణంగా 20వ తేదీనే దీపావళి నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
రాజంపేట: జవహర్ నవోదయ విద్యాలయం(రాజంపేట మండలం నారమరాజుపల్లె)లో 2026–27 సంవత్సరానికి 11 వతరగతిలో ప్రవేశానికి మరోసారి గడువును పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి అన్నమయ్య, కడప జిల్లాకు చెందిన విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌ఏవీవోడీఏవైఏ.జీవోఎన్ వె వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. చివరి తేది 23–10–2025 అని వెల్లడించారు.
● 2026–27 సంవత్సరానికి సంబంధించి 9వ తరగతిలో ప్రవేశానికి కూడా గడువును పెంచినట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ తెలిపారు. 23.10. 2025 వరకు గడువు ఉందని వెల్లడించారు.
ఖాజీపేట: కార్తీక మాసం సందర్భంగా నాగనాథేశ్వరస్వామి కొండ పైకి వచ్చే భక్తుల తలనీలాలు, టెంకాయలు విక్రయించే విషయమై దేవదాయ శాఖ అధికారులు శనివారం వేలం పాట నిర్వహించారు. తలనీలాలు పోగు చేసుకునే హక్కును రూ.4.50 లక్షలకు మహేష్ దక్కించుకున్నారు. టెంకాయల అమ్మకం కోసం రూ.1.25 లక్షలకు హరిప్రసాద్ పాట పాడారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మూల విరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సీతారామలక్ష్మణ మూర్తులను అందంగా అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.
కడప: కడప నగర శివారులోని ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో చిన్న పిల్లల విభాగం (పీడియాట్రిక్స్)లో పీజీ సీట్ల సంఖ్య ఏడుకు చేరింది. ఎన్‌ఎంసీ ఇటీవల 4 పీజీ సీట్లు మంజూరు చేసింది. గతంలో 3 పీజీ సీట్లు ఉండేవి. సీట్ల పెంపు కోసం హెచ్‌ఓడీతోపాటు వైద్యులు కృషి చేశారని జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జమున తెలిపారు. శనివారం ప్రిన్సిపాల్ తమ చాంబర్‌లో పీడియాట్రిక్ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ వై. వంశీధర్, వైద్యులు అనిల్ కిరణ్, పద్మినీ ప్రియా, బి.కె.నిరంజన్‌తోపాటు చిన్నపిల్లల విభాగం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
స్వల్ప వర్షం
స్వల్ప వర్షం