
కలంపై కూటమి కక్ష
నిజాలను నిర్భయంగా రాస్తున్న పత్రికలపై, విలేకరులపై కూటమి సర్కార్ కక్షగట్టింది. అక్రమ కేసులతో వేధిస్తోంది.పత్రికా కార్యాలయాల్లో సోదాలు, సంపాదకుల ఇళ్లలో తనిఖీల పేరుతో పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది.అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. మీడియాపై అంక్షలు విఽధించడం తగదని పలువురు ప్రజాస్వామ్యవాదులు,
పార్టీల నాయకులు అభిప్రాయపడతున్నారు.
పాత్రికేయులపై వేధింపులు తగదు
ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకం. పాలకులు చేసే తప్పులను పత్రికలు చూపడం సహజం. కల్తీ మద్యంపై వార్త రాసిన సాక్షి ప్రతినిధులపై కేసుల నమోదు, వేధింపులు తగవు. ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న చర్యలు సరికాదు. ప్రభుత్వాలు చేసే లోపాలను ఎత్తిచూపే హక్కు మీడియాకు ఉంది. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి.
– గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి, వైఎస్సార్ జిల్లా
ఉద్దేశ పూర్వకంగానే సాక్షిపై కుట్ర
ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం సాక్షి పత్రికపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెలుగులోకి తేవడం నేరం కాదు. తప్పులను ఎత్తిచూపే హక్కు పత్రికలకు ఉంది. స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు సాక్షి కార్యాలయానికి వెళ్లడం, సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది.
– పోరెడ్డి నరసింహారెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రొద్దుటూరు
పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు
ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోంది. మీడియాలో ప్రసారం చేసిన వాటిపైన, పేపర్‌లలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉంటే వివరణ ఇవ్వడమో, ఖండించడమో చేయాలి. అలా కాకుండా పోలీసుల ద్వారా నోటీసులు జారీ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టడం తగదు.
– బి.దస్తగిరిరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి

కలంపై కూటమి కక్ష

కలంపై కూటమి కక్ష

కలంపై కూటమి కక్ష

కలంపై కూటమి కక్ష