
సాక్షిపై వేధింపులు సరికాదు
ఖాజీపేట : నకిలీ మద్యం దోపిడీని వెలుగులోకి తీసుకు వస్తున్న సాక్షి ఎడిటర్, పత్రికా విలేకరుల పై కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. దుంపలగట్టు గ్రామంలో విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి సర్కర్‌కు కొన్ని పత్రికలు వత్తుసు పలుకుతూ ఉంటే నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకు వచ్చింది ఒక్క సాక్షి దినపత్రిక మాత్రమే అన్నారు. ప్రతి పక్ష పాత్ర పోషిస్తూ కూటమి ప్రభుత్వ తప్పులను ప్రజలకు వివరిస్తున్న పత్రికల గొంతు నొక్కేయాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలకు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.