ఏపీ ఎకై ్సజ్‌ సురక్ష యాప్‌ ద్వారా మద్యం అమ్మకాలు | - | Sakshi
Sakshi News home page

ఏపీ ఎకై ్సజ్‌ సురక్ష యాప్‌ ద్వారా మద్యం అమ్మకాలు

Oct 19 2025 7:01 AM | Updated on Oct 19 2025 7:01 AM

ఏపీ ఎ

ఏపీ ఎకై ్సజ్‌ సురక్ష యాప్‌ ద్వారా మద్యం అమ్మకాలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఉమ్మడి కడప జిల్లాలో కల్తీ మద్యానికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఏపీ ఎకై ్సజ్‌ సురక్ష యాప్‌ను ప్రవేశ పెట్టిందని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ జయరాజు పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని కడప నగరం, బద్వేలు, సిద్దవటం పరిధిలోని మద్యం దుకాణాల్లోని అమ్మకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం కొనుగోలు చేసే వ్యక్తి ఏపీ ఎకై ్సజ్‌ సురక్ష యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా స్కాన్‌ చేయగానే మద్యం తయారీ, ధర, తయారు చేసిన కంపెనీ, ఏ మద్యం దుకాణంలో విక్రయించారు అనే వివరాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, కడప స్టేషన్‌ సీఐ కృష్ణకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పరిమి శ్రీరామనాథ్‌కు గడియారం

సాహిత్య పురస్కారం

కడప సెవెన్‌రోడ్స్‌ : హెదరాబాదుకు చెందిన యువకవి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పరిమి శ్రీరామనాథ్‌ ‘మహాకవి’ డాక్టర్‌ గడియారం వేంకట శేషశాస్త్రి 44వ సాహిత్య పురస్కారానికి ఎంపికై నట్లు రచన సాహిత్య వేదిక కార్యదర్శి డాక్టర్‌ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి తెలిపారు. పురస్కార ప్రదాన సభ రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26వ తేది సాయంత్రం 5:30 గంటలకు ప్రొద్దుటూరులోని అరవిందాశ్రమంలో నిర్వహిస్తున్నామన్నారు. 1982 నుంచి ప్రతి ఏటా రాష్ట్ర స్థాయిలో ఎంపికై న కావ్యానికి బహూకరిస్తూ వస్తున్న ఈ అవార్డుకు 2025 సంవత్సరానికి పరిమి శ్రీరామనాథ్‌ రచించిన ‘జీవాతువు’ అనే కావ్యం ఎంపికై నట్లు తెలిపారు. పురస్కార ప్రదాన సభలో శ్రీరామనాథ్‌కు కవి సన్మానం, అవార్డుకు గాను రూ.10,000 నగదు బహుమతి, పురస్కారపత్రం, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

చక్రాయపేట : మండలంలోని గండి కొవ్వూరు గ్రామం ఓబుళనాయునిపల్లెలో గండికోట జగదీష్‌(18) అనే యువకుడు తమ ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగదీష్‌ తల్లిదండ్రులు జనార్దన, పావని జీవనోపాధి నిమిత్తం కువైట్‌లో ఉన్నారు. లక్కిరెడ్డిపల్లెలోని అమ్మమ్మ ఇంటివద్ద జగదీష్‌ ఉండేవారు. తనకు బుల్లెట్‌ బైకు కొనివ్వమని ఫోన్‌ చేసి వత్తిడి తేవడంతో తండ్రి మందలించాడని మనస్థాపానికి గురై లక్కిరెడ్డిపల్లె నుంచి ఓబుళనాయునిపల్లెలో ఉన్న ఇంటికు వచ్చాడు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీష్‌ ఫోన్‌ పనిచేయక పోవడంతో పాటు అలిగి వచ్చాడని అతని అమ్మమ్మ శనివారం ఓబుళనాయునిపల్లెలోని ఇంటి వద్దకు వచ్చి తలుపు తీయగా జగదీష్‌ ఉరివేసుకుని ఉండటాన్ని గమనించింది. గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

అర్ధరాత్రి లిఫ్ట్‌ ఇచ్చి దోపిడీ చేశారు

మదనపల్లె రూరల్‌ : అర్ధరాత్రి వేళ బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తికి లిఫ్ట్‌ ఇస్తామని బలవంతంగా బైక్‌లో ఎక్కించుకుని దారిదోపిడీ చేసిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని సత్సంగ్‌ స్కూల్‌ సమీపంలో నివాసం ఉన్న విజయ్‌కుమార్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి బెంగళూరులో ఆత్మకూరు బస్సులో బయలుదేరి రాత్రి 12.45 గంటల సమయంలో నక్కలదిన్నె తండా వద్ద దిగి ఇంటికి నడిచి వెళుతున్నాడు. ఆ సమయంలో అక్కడే కాపు కాసిన గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై అతడి వద్దకు వచ్చి లిఫ్ట్‌ ఇస్తామని బలవంత పెట్టారు. అతడు వద్దని చెప్పినా వినిపించుకోకుండా బలవంతంగా బైక్‌లోకి ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లాక బైక్‌ నిలిపి అతడి వద్ద ఉన్న రూ.20వేల నగదు, 15 గ్రాముల బంగారు చైను దోచుకున్నారు. బాధితుడు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో దోపిడీ ఘటనపై ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ శివకుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహమ్మద్‌ రఫీ తెలిపారు.

ఏపీ ఎకై ్సజ్‌ సురక్ష యాప్‌ ద్వారా  మద్యం అమ్మకాలు
1
1/2

ఏపీ ఎకై ్సజ్‌ సురక్ష యాప్‌ ద్వారా మద్యం అమ్మకాలు

ఏపీ ఎకై ్సజ్‌ సురక్ష యాప్‌ ద్వారా  మద్యం అమ్మకాలు
2
2/2

ఏపీ ఎకై ్సజ్‌ సురక్ష యాప్‌ ద్వారా మద్యం అమ్మకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement