
బాలికలు పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ రమాదేవి తెలిపారు. శనివారం జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ ఫర్ చిల్డ్రన్‌లో అంతర్జాతీయ బాలికాదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలకు విద్యా ప్రాముఖ్యత, అంతర్జాతీయ బాలికా దినోత్సవ విశిష్టతను వివరించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ ఆఫీసర్ హరిబాబు మాట్లాడుతూ బాలికలు, మహిళలకు డీఎల్‌ఎస్‌ఏ ద్వారా కలిగే ప్రయోజనాలు, చట్టాలపై తెలియజేశారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సాయం అందించడం జరుగుతుందని వివరించారు. అనంతరం వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఎంఓ భారతి, సీడీపీఓ జె.వాణి, డిస్ట్రిక్ట్ మిషన్ కోఅర్డినేటర్ శోభారాణి, మిషన్ వాత్సల్య సిబ్బంది, మిషన్ శక్తి సిబ్బంది, మహిళా పోలీసులు, ఐసీడీఎస్ సూపర్ వైజర్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.