
● సీఎంకు ఆహ్వానం
కడప సెవెన్‌రోడ్స్: కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్‌ఎస్ అరిఫుల్లా హుస్సేనీ సాహెబ్.. సీఎంను కలిసి ఆహ్వానం అందించారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉరుసు మహోత్సవాలు నవంబరు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నాయని, ఈ మహోత్సవాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఉరుసు ఉత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమీన్ పీర్ దర్గా మేనేజర్ మొహమ్మద్ అలీఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు ఉన్నారు.