
పరిశోధనా విశ్వవిద్యాలయంగా నిలవాలి
కడప ఎడ్యుకేషన్ : నాణ్యమైన పరిశోధనలతో యోగి వేమన విశ్వవిద్యాలయం రానున్న మూడేళ్లలో ‘పరిశోధన విశ్వవిద్యాలయం’గా నిలవాలని.. ఆ బాధ్యతను రీసెర్చ్ స్కాలర్లు తీసుకోవాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయంలోని స్కాలర్లతో అన్నమాచార్య సెనేట్ హాలులో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనల సంఖ్య పెరగడంతోపాటు నాణ్యమైన పరిశోధనలు రావాలన్నారు. ప్రఖ్యాత పరిశోధన జర్నల్స్‌లో కథనాలు ప్రచరితమైతే తద్వారా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పక్షం రోజులకు ఒకసారి నిపుణులను మన విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి వివిధ అంశాల్లో మెలకువలు నేర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాస్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్ర ఓబుళరెడ్డి, స్కాలర్లు పాల్గొన్నారు.
ఉప కులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్