భారమైన వైద్యం!
● ఐదు రోజులుగా ‘ఎన్టీఆర్ వైద్య సేవ’లు పూర్తిగా నిలుపుదల
● వైద్యం కోసం పేదల అవస్థలు
● గాడితప్పిన ‘ఎన్టీఆర్ వైద్య సేవ’పథకం
కడప రూరల్: ‘ఎన్టీఆర్ వైద్య సేవ’పథకం అస్తవ్యస్తంగా మారింది. కార్పొరేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలు లభించేడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఆ ఉద్దేశమే నీరుగారుతోంది. ప్రభుత్వం ఈ నెట్ వర్క్ ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పెండింగ్ బిల్లులు రూ. కోట్లల్లో పేరుకు పోయాయి. ఫలితంగా వైద్యం పడకేసింది.
రోజుల తరబడి ఇదే ప్రథమం
ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం కోట్లల్లో బిల్లులను మంజూరు చేయాలి. ఏడాది దాటినా ఇంతవరకు బిల్లులను మంజూరు చేయలేదు. ఫలితంగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి ఔట్ పేషెంట్‌తో పాటు అత్యవసర సేవలను పూర్తిగా నిలిపివేశారు. ప్రధానమైన గుండె, కిడ్నీ తదితర వ్యాధులకు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు లభిస్తాయి. ఇప్పుడు ఈ ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలుపుదల చేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లండి...
యథావిధిగా ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు వచ్చే పేదలు వైద్య సేవలు లేవని తెలిసి ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉండే వైద్య మిత్రలు వచ్చిన వారితో ‘వైద్య సేవలు నిలుపుదల చేశారు. ఉచిత వైద్యం కావాలంటే కడప రిమ్స్ లేదా ఇతర ప్రభుత్వ ఆసుత్రులకు వెళ్లాలి’అని సూచిస్తున్నారు. దీంతో సాధారణంగానే వ్యాధిగ్రస్తులతో కడప రిమ్స్‌తో పాటు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతుంటాయి. ఇప్పడు ఆ అసుపత్రుల్లో రోగుల సంఖ్య మరింతగా పెరిగింది.
ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో
వైద్య సేవలు నిలిపివేయడంతో..
ఆయాసంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఈ వృద్ధుడి పేరు లక్ష్మిరెడ్డి. కడప నగర శివార్లలోని పుట్లంపల్లె నివాసి. మనవడు హర్షవర్దన్‌రెడ్డి ఆయనకు సహాయంగా ఉన్నాడు. తీవ్ర ఆయాసంతో మూడు రోజుల నుంచి కడప రిమ్స్‌లోని ఐసీయూలో వైద్య చికిత్సలు పొందుతున్నాడు. ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపి వేయడంతో చేసేదిలేక తాత లక్ష్మిరెడ్డిని తీసుకుని చికిత్స కోసం రిమ్స్‌కు వచ్చానని మనవడు హర్షవర్దన్‌రెడ్డి తెలిపారు. పేదలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా ఉచిత వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
బంద్ ప్రభావం పేదలపై పడింది. ఉచిత వైద్యం లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేనివారు ప్రైవేట్ వైద్యుడిని లేదా ఆర్‌ఎంపీలను సంప్రదిస్తున్నారు. ఫలితంగా ఒక పేద రోగి డాక్టర్ ఫీజును రూ.300కు పైగా చెల్లిస్తున్నారు. వైద్య పరీక్షలకు ఎంత లేదన్నా రూ.350 నుంచి రూ.2 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. స్కానింగ్‌కు రూ.7 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా జిల్లాలో ఎవరికై నా పెద్ద సమస్య వచ్చిందంటే కడపకు రావాలి. ఇక్కడ ఆ వ్యాధికి చికిత్స లభించకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. పైగా ఇది సీజనల్ వ్యాధుల కాలం. డెంగ్యూ, టైఫాయిడ్ తదితర జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వైద్య సేవలు బంద్ కావడంతో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
కూటమి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ‘ఎన్టీఆర్ వైద్య సేవ’(
కూటమి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ‘ఎన్టీఆర్ వైద్య సేవ’(
కూటమి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ‘ఎన్టీఆర్ వైద్య సేవ’(