
సూపర్ సిక్స్.. అట్టర్ ఫ్లాప్
ఎంపీని కలిసిన ఎమ్మెల్సీ
పులివెందుల: కూటమి నేతలు రాష్ట్ర ప్రజలకు ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు.. సూపర్ ఫ్లాప్ అయ్యాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. బుధవారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోసమే కూటమి నాయకులు సూపర్ సిక్స్ పథకాలంటూ ఊదరగొట్టారన్నారు. వారికి ఎల్లో మీడియా వంత పాడుతూ ప్రజలను మభ్యపెట్టిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలు తొందరగానే గ్రహించారన్నారు. కూటమి అమలు చేస్తున్న అరకొర పథకాల కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాల పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని ప్రజలు అభిప్రాయానికి వచ్చారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఉల్లి రైతులను ఆదుకోవాలి..
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఉల్లి రైతులు ఎంపీని కలిశారు. ఉల్లి పంట ధరలు దారుణంగా పతనమయ్యాయని, లక్షలు ఖర్చు పెట్టి పంటను సాగు చేసి అప్పులపాలయ్యామని వాపోయారు. దీనికి స్పందించిన ఎంపీ ఇప్పటికే ఉల్లి రైతుల కష్టాలను వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి కలెక్టర్‌కు నివేదించామన్నారు. దీంతో పాటు మరోసారి అక్కడి నుంచే కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు ప్రభుత్వం హెక్టార్‌కు రూ.50వేలు పరిహారం ప్రకటించిందని, అదేవిధంగా వైఎస్సార్ జిల్లా రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. దీనికి కలెక్టర్ రెండు, మూడు రోజుల్లో జిల్లా రైతులకు కూడా నష్టపరిహారం విషయమై జీఓ వస్తుందని ఎంపీకి వివరించారు.
కూటమి ప్రభుత్వంవల్ల రాష్ట్రానికి అన్యాయం
కూటమి ప్రభుత్వంవల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ సాయినాఽథ్ శర్మ పేర్కొన్నారు. బుధవారం పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆయనను ఆత్మీయంగా అభినందించి కొత్త బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
నివాళి: పట్టణంలోని జెండామానువీధిలో నివాసముంటున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త జాఫర్ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ జాఫర్ మృతదేహానికి నివాళులర్పించారు.
బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో రామసుబ్బారెడ్డి పలు రాజకీయ అంశాలపై చర్చించారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి