
ఎడిటర్ పట్ల వేధింపులు తగదు
సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని పోలీసులు వేధించడం తగదు. నోటీసులు ఇవ్వాలి తప్ప కార్యాలయాల వద్దకు వెళ్లి హంగామా చేయడం మంచిది పద్ధతి కాదు. ప్రస్తుతం జరుగుతున్న అనేక పరిణామాలు, ఇతర పరిస్థితులను వివరిస్తున్నసాక్షి జర్నలిస్టులపై కేసులు పెట్టి వేధించడం సరికాదు. ఏదైనా ఉంటే న్యాయపరంగా తేల్చుకోవాలి. కేసులు నమోదు చేసి వేధించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. తప్పు చేస్తే లీగల్‌గా నోటీసులు ఇచ్చి న్యాయస్థానంలో పోరాడాలే తప్ప ఇలా చేయడం కరెక్టు కాదు. – సి.వెంకటరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కడప