
16న ఎన్‌ఎస్‌ఎస్ ఉత్తమ పురస్కారాల ప్రదానం
కడప ఎడ్యుకేషన్ : జాతీయ సేవా పథకం ద్వారా విస్త్తృత సేవలందించిన కళాశాలలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లకు ఉత్తమ పురస్కారాల ప్రదానం చేయనున్నట్లు వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ప్రకటించారు. తన చాంబర్‌లో పురస్కారాలకు ఎంపికై న వారి జాబితాను ఆయన మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 16వతేదీన వైవీయూలో అవార్డులు అందజేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.పద్మ , ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డా.ఎన్.వెంకట్రామిరెడ్డి, డాక్టర్ కె.శ్రీనివాసరావు, ప్రొఫెసర్ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. 2024–25 సంవత్సరంలో అవార్డులకు ఎంపికై న వారి వివరాలిలా ఉన్నాయి.
ఉత్తమ వాలంటీర్లు : డి శ్రావణి(ప్రభుత్వ డిగ్రీ కళాశా ల రాజంపేట), డి.సిద్ధయ్య (ఎస్‌బిఎస్‌వైఎం డిగ్రీ కళాశాల, మైదుకూరు), కేబీ.ఈశ్వర్(వైవియూ కాలేజ్), కె.శ్రీనివాసులురెడ్డి (వైవీయూ పీజీ కళాశాల).
ఉత్తమ ప్రోగ్రామ్ ఆఫీసర్లు : డాక్టర్ కె.గోవింద రెడ్డి(ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఫర్ గర్‌ల్స్, కడప), డాక్టర్ యు.సునీత(ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పులివెందుల), సి.మల్లేశ్వరమ్మ, (వైఎస్‌ఆర్‌వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వేంపల్లి), డాక్టర్ ఎ.నాగరాజు(గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్(ఎ), కడప), డాక్టర్ పత్తి వెంకటకృష్ణారెడ్డి(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైదుకూరు), డాక్టర్ ఎస్.సునీత (వైవీయూ కళాశాల, కడప), డాక్టర్ ఎస్‌పి.వెంకటరమణ(వైవీయూ కళాశాల, కడప).
ఉత్తమ కళాశాలలు : సి.సూర్యారావు(ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్‌ల్స్, కడప), డాక్టర్ పి.నారాయణ రెడ్డి(ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైదుకూరు), ప్రొఫెసర్ టి.శ్రీనివాస్ (ప్రిన్సిపల్, వైవీయూ కాలేజ్).