
అంగన్వాడీ టీచర్‌కు గాయాలు
ముద్దనూరు : మండలంలోని కొత్తపల్లె గ్రామంలో మంగళవారం ఉదయం అంగన్వాడీ టీచర్ ప్రమీలను కారు ఽఢీకొంది. ఈ ఘటనలో ఆమె తీవ్ర గాయాలపాలైంది. స్థానికుల సమాచారం మేరకు ప్రమీల కొత్తపల్లెలోని ప్రధాన రహదారిని దాటుతుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. గాయాలపాలైన ఆమెను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.
మద్యం తాగి ఒకరు మృతి
జమ్మలమడుగు : పట్టణంలోని ఎత్తపువారి కాలనీలో నరసింహులు(35) అనే వ్యక్తి మద్యం తాగి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంలో మద్యానికి బానిసై అతిగా తాగుతుండటంతో శరీరంలోని భాగాలు దెబ్బతిన్నాయని, దీంతో నరసింహులు చనిపోయారని తెలిపారు. బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న యజమాని మృతి చెందడంతో భార్య, అతడి పిల్లలు విషాదంలో మునిగిపోయారు.
ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
కడపఅర్బన్ : కడప నగరం శంకరాపురంలో కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు చిన్న చౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. సీఐ వివరాల మేరకు.. శంకరాపురానికి చెందిన విజయకుమార్ సమీపంలో నివాసమున్న అక్కిశెట్టి వెంకట్ మంగళవారం చిన్న విషయమై గొడవపడ్డారు. దీంతో ఆవేశంతో విజయ్ కుమార్‌ను కులం పేరుతో దూషిస్తూ వెంకట్ దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమో దు చేసి విచారిస్తున్నామని సీఐ తెలిపారు.
వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు
కడప అర్బన్ : కడప నగరం చిన్న చౌక్ పోలీస్ స్టే షన్ పరిధిలో ఓ వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు సుబ్బరాయుడు అనే వృద్ధుడు ఇంటి సమీపంలో ఆడుకుంటున్న 8 సంవత్సరాల బాలికను ఇంట్లోకి పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
ఎల్‌ఎల్‌బీ పరీక్ష కేంద్రాల తనిఖీ
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయంలోలా సెమిస్టర్ పరీక్ష కేంద్రాలను నూతన ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మంగళవారం తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించి పరీక్షల ఏర్పాట్ల గురించి చీఫ్ సూపరింటెండెంట్ ఆచార్య జి.కాత్యాయనిని ఆరా తీశారు. ప్రస్తుత పరీక్షకు 503 మంది హాజరయ్యారని తెలిపారు. అతి పెద్ద పరీక్షల హాల్‌ను వీసీ పరిశీలించారు. ఆయన వెంట కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కెఎస్వీ.కృష్ణారావు ఉన్నారు. పరీక్షల విధుల్లో పరీక్షల అబ్జర్వర్ డా.గణేష్నాయక్, సహాయ పరీక్షల అధికారులు డా .టి. లక్ష్మి ప్రసాద్, డా.మునికుమారి, సిబ్బంది పి.చంద్రమౌళి పాల్గొన్నారు.

అంగన్వాడీ టీచర్‌కు గాయాలు