
బరిలో దిగితే.. పతకమే
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఆ చిన్నారి వయసు పదేళ్లు... పట్టుదల ఏకాగ్రత, అలుపెరుగని సాధనతో లక్ష్యంపై గురిపెట్టి పతకాలు సాధించారు. చిన్న వయసులోనే అద్భుత సాధనతో రాణించి భళా అనిపించారు. కడప నగరంలోని ఎడిఫై ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. పొద్దుటూరుకు చెందిన పదేళ్ల చిన్నారి సారా ఇర్ఫాన్ క్రీడల్లో సత్తా చాటుతున్నారు. అండర్–14 ఇన్‌లైన్ విభాగంలో రింగ్–3, రింగ్–4, రోడ్డు–1 కేటగిరీలలో రాణించి భళా అనిపించారు. దీంతో ఆయా విభాగాల్లో బాలుడికి మూడు రజత పతకాలు దక్కాయి. ఈ విజయాలతో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సారా ఇర్ఫాన్ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని విజయాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. సారా తండ్రి ఇర్ఫాన్‌బాషా, కోచ్ నాగేశ్వరరావులను నిర్వాహకులు అభినందించారు.
రజిత పతకాలతో సారా ఇర్ఫాన్ సత్తా

బరిలో దిగితే.. పతకమే