
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలి
విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై యాజమాన్యాలకు అనేక సార్లు నోటీసులిచ్చినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో 34వేలమంది కాంట్రాక్టు కార్మికులు, 7వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. విద్యుత్ సంస్థలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను భేషరతుగా క్రమబద్దీకరించాలి. విద్యుత్ ప్రమాదాల వల్ల 450 మంది మరణించారు, 250 మంది కాళ్లు, చేతులు పోగొట్టుకున్నారు. యాజమాన్యం వైద్యపరంగా వారికి ఎలాంటి సాయంగానీ, పరిహారం గానీ అందించలేదు. 1999 నుంచి 2004 వరకూ ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్ వర్తింపజేయాలి.
– బి. రామలింగారెడ్డి, విద్యుత్ జేఏసీ, రాష్ట్ర వైస్ చైర్మన్