
విద్యుత్ ఉద్యోగుల సమ్మె బాట
కడప కార్పొరేషన్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన తీవ్రతరం అవుతోంది. శుక్రవారం కడప డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన కాంట్రాక్టు ఉద్యోగులతో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ క్రమబద్దీకరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, తమ కుటుంబాలకు ఆరోగ్య రక్షణ కల్పించాలని, 2022 పీఆర్‌సీకి సంబంధించిన బకాయిలను చెల్లించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈనెల 13న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి మహా ధర్నా చేయనున్నామని, 15 నుంచి నిరధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
కడప డివిజన్ కార్యాలయం ఎదుట
ఆందోళన
13న విజయవాడలో మహాధర్నా
15 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరిక