
ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు తప్పిన పెనూ ప్రమాదం
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామం ముద్దనూరు రోడ్డు ఐసీఎల్ వద్ద ఉన్న వంతెన వద్ద ఏఆర్ ట్రావెల్ ప్రైవేటు బస్సుకు పెద్ద పెనుప్రమాదం తప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని రోడ్డుకు అడ్డంగా నిలబడింది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులెవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ విశ్వనాథ్‌రెడ్డి పరిశీలించారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు నుంచి నంద్యాలకు ఏఆర్ ట్రావెల్ బస్సు బయలు దేరింది. ఎర్రగుంట్ల మండల పరిధిలోని చిలంకూరు గ్రామం ఐసీఎల్ వద్దకు రాగనే ఎదురుగా చైన్నె నుంచి తాడిపత్రికి బొగ్గును తీసుకెళ్లే లారీ ్డ వచ్చింది. డ్రైవర్ బ్రేక్ వేయాలని ప్రయత్నించాడు. బ్రేక్ ఫైయిలూర్ కావడంతో హ్యాండ్ బ్రేక్ వేశారు. దీంతో లారీని ఢీకొని రోడ్డుకు అడ్డంగా బస్సు ఆగిపోయింది. బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటన తెల్లవారిజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని ట్రాఫిక్ అంతరాయం కాకుండా చూశారు.