
ఘనంగా బిషప్ జన్మదిన వేడుక
కడప రూరల్ : సీఎస్‌ఐ రెవరెండ్ బిషప్ ఐజాక్ వర ప్రసాద్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. రాయలసీమ డయాసిస్ మండల అధికారులు, గురువుల ఆధ్వర్యంలో స్థానిక చర్చిలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలను బిషప్ ఐజాక్ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ చర్చి యూత్ బోర్డు సెక్రటరీ మోజెస్ మాట్లాడుతూ బిషప్ ఐజాక్ వరప్రసాద్ జన్మదిన వేడుక సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. చర్చి అసిస్టెంట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ పీఎస్.వినయ్‌కుమార్‌క, రెవరెండ్ సంపత్, సరోజ్‌కుమార్, డేనియల్, తదితరులు పాల్గొన్నారు