టెట్‌.. టెన్షన్‌ ! | - | Sakshi
Sakshi News home page

టెట్‌.. టెన్షన్‌ !

Oct 9 2025 2:57 AM | Updated on Oct 9 2025 2:57 AM

టెట్‌

టెట్‌.. టెన్షన్‌ !

టెట్‌.. టెన్షన్‌ !

ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలి

కడప ఎడ్యుకేషన్‌ : పిల్లలకు పాఠాలు బోధించి పరీక్షలు నిర్వహించే గురువులకే ఇప్పుడు పరీక్ష పాస్‌ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులంతా తాజాగా టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌) రాయాల్సిందేనని తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పైగా రెండేళ్లలోపు పాస్‌ కావాల్సిందేనని నిబంధనతో గురువులు ఆందోళన చెందుతున్నారు. సీనియర్‌ టీచర్స్‌లో కలవరం మరింత ఎక్కువైంది.

సంస్కరణల పేరుతో....

అసలే విద్యారంగంలో సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా 1 నుంచి 10వ తరగతి వరకు 9 రకాల బడులను తీసుకొచ్చింది. ఇప్పటికే పలు రకాల యాప్‌లతో టీచర్లకు మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు టీచర్‌ ఎలిజిబులిటి టెస్టు(టెట్‌) పాస్‌ కావాల్సిందేనని ఉపాధ్యాయులపై సుప్రీంకోర్టు గుదిబండ పెట్టింది. 2010కి ముందు ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్‌ తప్పని సరిగా రాసి అర్హత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఏళ్లుగా విద్యార్థులకు బోధిస్తున్నా తమకు ఇప్పుడు టీచర్‌ ఎలిటిబులిటి టెస్టు నిర్వహించడం ఏమిటంటూ ఉపాధ్యాయులు, సంఘ నాయకులు వాపోతున్నారు.

పదోన్నతులతో లింక్‌.... సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్‌ రాసి ఉత్తీర్ణత కావాలి. కాకపోతే ఉద్యోగం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అయ్యవార్లను టెన్షన్‌ వెంటాడుతోంది. దీనికితోడు టెట్‌ పాస్‌ కాని వారికి పదోన్నతులతోపాటు నియామకాలు కూడా ఉండవని కోర్టు తీర్పులో పేర్కొంది. ఐదేళ్లలోపు సర్వీస్‌ మిగిలి ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికి వారికి పదోన్నతులు కావాలంటే టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. 2010 విద్యాహక్కుచట్టం అమలులోకి వచ్చిన తర్వాత టెట్‌ తప్పనిసరిగా పాస్‌ కావాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో 2010 తర్వాత వచ్చిన వారంతా టెట్‌ పాసైన వారే.

కఠిన పరీక్షే... టెట్‌ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే ఓసీ కేటగిరి వారు 60 శాతం, బీసీ కేటగిరి 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్‌సీ, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ కేటగిరి వారు 40 శాతం మార్కులు సాధించాలి. టెట్‌ పాస్‌ కావాలంటే తెలుగు, ఇంగ్లీష గణితం, చైల్డ్‌ డెవెలప్‌మెంట్‌, పర్యావరణానికి సంబంధించిన అంశాలన్నీ చదవాల్సి ఉంటుంది, బయలాజికల్‌ సైన్సు ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్‌ స్టడీస్‌ ఇలా సంబంధం లేని సబ్జెక్టులు టెట్‌లో పెట్టి పాస్‌ కావాలంటే ఎలా అని టీచర్లు వాపోతున్నారు.

టీచర్లకు కలవరపెడుతున్న

సుప్రీంకోర్టు తీర్పు

రెండేళ్లలో టెట్‌ పాస్‌ కాకపోతే పదోన్నతులు కరువే !

సీనియర్‌ ఉపాధ్యాయుల్లో ఆందోళన

తీర్పుపై పునరాలోచించాలంటున్న ఉపాధ్యాయులు

సుప్రీం తీర్పు నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి రివ్యూ పిటిషన్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ ఒక ప్రకటన చేయాలి. విద్యాహక్కు 2010 నుంచి అమలైన దృష్ట్యా అంతకుముందు నియామకం పొందిన ఉపాధ్యాయులందరికీ మినహాయింపునివ్వాలి.– మల్లు రఘునాథ రెడ్డి ఎస్టీయూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

టెట్‌.. టెన్షన్‌ !1
1/1

టెట్‌.. టెన్షన్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement