
అనుభవమే అర్హత
విద్యారంగంలో అనుభవమే గొప్ప అర్హత. సీనియర్ టీచర్ల బోధనా నైపుణ్యాలను టెట్ పరీక్షతో కొలవలేం. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లను దాఖలు చేయాలి.
– సజ్జల రమణారెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
ఐదేళ్ల తర్వాత ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయులందరూ సర్వీసులో కొనసాగాలంటే తప్పనిసరిగా రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సమీక్షించాలి. టెట్ అర్హత పరీక్ష ఉత్తీర్ణత కాకుంటే ఉద్యోగం నుండి రిటైర్ కావాలని, ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్ కావా లంటే టెట్ పాస్ కావాల్సిందేనంటూ సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటీఈ, ఏపీ ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా రివ్యూ పిటిషన్లు వేయాలి. – బి. లక్ష్మి రాజా, యూటీఎఫ్, రాష్ట్ర కార్యదర్శి

అనుభవమే అర్హత