మానసిక వైద్యశాల రాయలసీమ వాసులకు వరం | - | Sakshi
Sakshi News home page

మానసిక వైద్యశాల రాయలసీమ వాసులకు వరం

Oct 8 2025 6:47 AM | Updated on Oct 8 2025 6:47 AM

మానసిక వైద్యశాల రాయలసీమ వాసులకు వరం

మానసిక వైద్యశాల రాయలసీమ వాసులకు వరం

కడప అర్బన్‌ : రాయలసీమ వాసులకు కడప మానసిక వైద్యశాల వరంగా భావించాలని కడప ఐఎంహెచ్‌ (ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌) హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌.వెంకట రాముడు అన్నారు. రిమ్స్‌ ఆవరణంలోని వంద పడకల మానసిక వైద్యశాల ఏడాదిన్నర కిందట ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఈ నెల 4వ తేదీ నుంచి ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటరాముడు మాట్లాడుతూ 50 ఏళ్ల కిందట మానసిక వైద్యశాల ఏర్పాటుచేశారని, దాదాపు 10వేల మందికి దివ్యాంగుల సర్టిఫికెట్లు అందిచామని తెలిపారు. కేవలం సిటీ స్కాన్‌, ఎమ్మారై స్కాన్ల కోసం జిజిహెచ్‌కు రోగులను పంపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

కడప ఐఎంహెచ్‌ సూపరింటెండెంట్‌

ఆర్‌.వెంకటరాముడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement