విపత్తుల నివారణపై మాక్‌ డ్రిల్‌ | - | Sakshi
Sakshi News home page

విపత్తుల నివారణపై మాక్‌ డ్రిల్‌

Oct 8 2025 6:47 AM | Updated on Oct 8 2025 6:47 AM

విపత్తుల నివారణపై మాక్‌ డ్రిల్‌

విపత్తుల నివారణపై మాక్‌ డ్రిల్‌

సిద్దవటం : విపత్తుల నివారణపై మండలంలోని భాకరాపేట హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో కర్మాగారాల డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ చిన్నారావు ఆధ్వర్యంలో మంగళవారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ముందుగా హెచ్‌పీసీఎల్‌లోని ఎమర్జెన్సీ–1లోని ట్యాంకు వద్ద డీజిల్‌ లీక్‌ అవడంతో దాన్ని కంట్రోల్‌ చేసేందుకు సిబ్బంది పనిచేస్తుండగా స్కానర్‌ కిట్టు కింద పడి మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్న వర్కర్లు ఫైర్‌ అని అరవడంతో హెచ్‌పీసీఎల్‌ సిబ్బంది సైరన్‌ మోగించారు. సిబ్బంది అప్రమత్తమై ఆటోమేటిక్‌ పరికరాలతో ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో పెట్రోల్‌ డిపో సిబ్బంది సహకారంతో పోమ్‌, వాటర్‌తో మంటలను అదుపు చేశారు. అక్కడ ఇద్దరు వర్కర్లకు ప్రమాదం జరగడంతో వారిని మెడికల్‌ క్యాంపుకు సిబ్బంది తీసుకొచ్చే సన్నివేశాన్ని మాక్‌ డ్రిల్‌ చేసి చూపించారు. అలాగే ఫిల్టర్‌–ఎ వద్ద డీజిల్‌ ఓవర్‌ లీక్‌ అవుతుండటంతో ఇలాగే చేశారు. ఇదంతా మాక్‌ డ్రిల్‌ అని తెలిసింది. చిన్నారావు మాట్లాడుతూ చట్ట ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి మాక్‌ డ్రిల్‌ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement