
మహర్షి వాల్మీకి.. అందరికీ ఆదర్శనీయులు
వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న
డీఆర్వో విశ్వేశ్వరనాయుడు
వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ఎస్పీ నచికేత్ విశ్వనాథ్
కడప సెవెన్‌రోడ్స్ : భారతీయ ఇతిహాసాన్ని, మానవ సంబంధాలు, కుటుంబ విలువల సారాంశాన్ని అపురూపమైన రామాయణ గ్రంథంగా సమాజానికి అందించిన ‘వాల్మీకి మహర్షి’ భావితరాలకు ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు తోపాటు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణ యాదవ్, ఎస్డీసీ వెంకటపతి, జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహ, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజల హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన పలువురు వక్తలు రామాయణ ప్రాశస్త్యం, వాల్మీకి పురాణం, సమాజంలో వాల్మీకి వర్గాల పరిస్థితులు, రిజర్వేషన్ మొదలైన అంశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కులసంఘాల నాయకులు, ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ఇతర శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
మానవతా విలువలు పెంపొందించుకోవాలి
కడప అర్బన్: రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పెంపొందించుకోవాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆకాంక్షించారు. కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాష్ బాబు, ఎ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏ.ఆర్ డీఎస్పీ నాగేశ్వరావు, ఆర్.ఐ లు శివరాముడు, టైటాస్, శ్రీశైల రెడ్డి, ఆర్.ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మహర్షి వాల్మీకి.. అందరికీ ఆదర్శనీయులు