
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
బి.కోడూరు : మండలంలోని మేకవారిపల్లె గ్రామానికి చెందిన సిద్దువెంకటరమణారెడ్డి (51) అనే రైతు తన పొలంలో విద్యుత్ మోటారు వద్ద విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం వర్షం కురవడంతో తన వరి పొలానికి సంబంధించిన వ్యవసాయ మోటారును ఆఫ్ చేసేందుకు వెళ్లి.. మోటారు, స్టాటర్ వద్ద ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై గట్టిగా కేక వేశాడు. ఆ కేక విని పక్క పొలం వారు అక్కడికి వెళ్లి చూడగా స్పృహ కోల్పోయి ఉండటంతో అతని భార్య, బంధువులకు తెలియజేశారు. వారు వెళ్లి వెంకటరమణారెడ్డిని ఆటోలో బద్వేలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటసురేష్ తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

విద్యుత్ షాక్‌తో రైతు మృతి