
వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం నిరసనను జయప్రదం చేయాలి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం పిలుపు మేరకు ఈనెల 30వ తేది నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న దళితులు జయప్రదం చేయాలని ఆ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అమరావతిలోని డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, పార్కును ప్రైవేటుకు అప్పగించడం వంటి వాటిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల అధికంగా నష్టపోయేది దళితులేనన్నారు. నిరసన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, మాజీ మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పాల్గొంటారని పేర్కొన్నారు.ఉదయం 9.30 గంటలకల్లా పార్టీ నాయ కులు, కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి, మా జీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మెన్ పులి సునీల్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శులు బాబు, త్యాగరాజు, సుబ్బరాయు డు, నేతలు వినోద్ కుమార్, కంచుపాటి బాబు, జాషువా, పి. సంపత్ కుమార్ పాల్గొన్నారు.